![]() |
![]() |
.webp)
ఆషాడ మాసం ప్రారంభమైంది. ఇక చిన్న పెద్ద తేడా లేకుండా అందరు గుడికి వెళ్తున్నారు. అందులోను నిన్న తొలి ఏకాదశి కావున కొందరు సెలబ్రిటీలు యాదాద్రి, స్వర్ణ గిరి, చిలుకూరు బాలాజీ టెంపుల్ కి వెళ్ళి పూజలు చేస్తున్నారు.
తొలి ఏకాదశి నాడు ఇద్దరు అత్తలతో గుడికి వెళ్ళింది దీపిక రంగరాజు. బ్రహ్మముడి సీరియల్ లో కావ్యగా నటిస్తున్న దీపిక రంగరాజు గురించి స్టార్ మా అభిమానులకి తెలిసిందే. స్డార్ మా టీవీలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ లో కనకం-కృష్ణమూర్తిల కుమార్తెగా కావ్య చేస్తోంది. దుగ్గిరాల ఇండి వారసుడు అపర్ణ సుభాష్ ల కొడుకు రాజ్ ని పెళ్ళి చేసుకున్న కావ్య.. ఎంతో అనుకువగా ఉంటూ అందరి మనసులు దోచేస్తోంది. అయితే కొత్త కోడలు అనామిక రావడంతో కావ్యది ఏం తప్పులేకపోయిన అప్పు ప్రేమ వల్ల తనని ధాన్యలక్ష్మి పూర్తిగా అపార్థం చేసుకుంది. దాంతో కథలో కొన్ని సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు రాజ్ తీసుకొచ్చిన బాబు సుభాష్ కొడుకే అని తెలిసిపోవడంతో కథ మరో మలుపు తిరిగింది. ఆ తర్వాత అసలు మాయకి నిజం చెప్పేయడంతో ఇంట్లో ఆ గొడవ సద్దుమణిగింది.
.webp)
ఇప్పుడు సీరియల్ లో కళ్యాణ్ ఒంటరితనం.. అప్పుని ఇంటిపక్కన వాళ్ళు అనే సూటిపోటి మాటలు.. సుభాష్ తో అపర్ణ మాట్లాడకపోవడం.. ఇలా ఈ సీరియల్ సాగుతుంది. ఇక కావ్య తెలుగు మాట్లాడటం నేర్చుకుంటుంది. దానితో పాటు హైదరాబాద్ లోని గుళ్ళు, షాపింగ్ మాల్స్ అంటూ అన్నీ తిరిగేస్తూ వ్లాగ్స్ చేస్తూ బిజీగా ఉంటోంది. ఇప్పుడు తాజాగా బ్రహ్మముడి సీరియల్ లోని అపర్ణ అలియాస్ శ్రీప్రియ శ్రీకార్ , రుద్రాణి అలియాస్ షర్మితతో కలిసి హైదరాబాద్ శివార్లలోని చిలుకూరు బాలాజీ టెంపుల్ కి వెళ్ళింది. ఇక అక్కడ పూజలు చేసి దానికి సంబంధించిన ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది దీపిక. ఎప్పుడు ట్రెడిషనల్ గా రెడీ అవుతూ తెలుగు సీరియల్ అభిమానుల ఆదరాభిమానాలు పొందుతుంది కావ్య అలియాస్ దీపిక. తనకి ఇన్ స్టాగ్రామ్ లో 323K ఫాలోవర్స్ ఉన్నారు.
![]() |
![]() |